Revanth Reddy: విమానాశ్రయాలపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి..! 27 d ago
TG : రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. బేగంపేటలో విమానాశ్రయం ఉన్నా దాన్ని ప్రముఖులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల వరంగల్ సభలో వరంగల్, రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్లలో ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.